17-02-2026 12:38:02 AM
ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ ఆఫీషియో ఓటుతో చైర్మన్ ఎంపిక
ఛైర్మన్‌గా పిండి జయరాములు.. వైస్ ఛైర్మన్‌గా విక్రమ్
అలంపూర్, ఫిబ్రవరి 16: అలంపూర్ మున్సిపాలిటీలో ఛైర్మన్ ,వైస్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగి చివరకు ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ ఆఫీషియో ఓటు మద్దతుతో బీఆర్‌ఎస్ కై వసం చేసుకుంది. మొత్తం 10 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 5 గెలుచుకోగా బీఆర్‌ఎస్ పార్టీ ఒకటి ఏకగ్రీవమై 4 వార్డుల్లో గెలుపొందాయి.చెరో 5 వార్డులు గెలుచుకున్న తరుణంలో చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ ఆఫీషియో ఓటుతో మద్దతుతో మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ కు ఆధిక్యం లభించింది.
దీంతో ఎట్టకేలకు పీఠం బీఆర్‌ఎస్ పార్టీ దక్కించుకుంది.కౌన్సిలర్లు ఉదయం 10 గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు. ఆరో వార్డు విజేత పిండి జ యరాములు ,వైస్ ఛైర్మన్ గా పదో వార్డు ఏకగ్రీవంగా ఎన్నికైన విక్రమ్ ను ఎన్నుకున్నారు.ఆర్డీఓ శ్రీనివాస్ రావు,కమిషనర్ శంకరయ్య నాయక్ కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంత రం మిగతా కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు చల్లా వెంకట్రామిరెడ్డిని కలిశారు వారిని ఎమ్మెల్సీ పూల మాలలు వేసి శాలువతో స త్కరించారు.
అనంతరం బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పట్టణ అభివృద్ధికి తో డ్పాటు అందించాలని నూతన చైర్మన్ పిండి జయరాములు, వైస్ చైర్మన్ విక్రమ్, కౌన్సిలర్లు ఆసి ఫ్ ఖాన్,మాధురి ,మోహన్ రెడ్డికు ఎమ్మెల్సీ చల్లా ఎమ్మెల్యే విజయుడు సూచించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ ప్రమోద్ , తన పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.