18 July, 2026 | 4:02 PM

డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం

18-07-2026 04:02 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్  జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (డీటిబ్ల్యూఓ)గా బాధ్యతలు స్వీకరించిన జాదవ్ అంబాజీని టీఎస్‌టిడబ్ల్యూటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నైతం కృష్ణారావు, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్, ప్రధాన కార్యదర్శి మడావి గోపాల్ తదితరులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జాదవ్ అంబాజీ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తానని తెలిపారు.