18 July, 2026 | 4:06 PM

విద్యార్థులకు గణిత సామాగ్రి పంపిణీ

18-07-2026 03:44 PM

గణపురం,(విజయక్రాంతి): ధర్మరావుపేట పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి పెంపొందించేందుకు గణిత ఉపాధ్యాయుడు పాశం బాపు స్వంత ఖర్చుతో సుమారు రెండు వేల రూపాయల విలువ చేసే గణిత సామాగ్రిని అందజేశారు. గణితం అంటే భయం పోయి, సులభంగా అర్థమయ్యేలా చేయాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు వీరన్న మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం స్వయంగా ముందుకు వచ్చిన పాశం బాపు సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనివాస్, కుమార స్వామి, శంకర్, శ్యామల, పాశాబి సురేష్, ఉపాధ్యాయులు బిల్ల రఘునాథ్ రెడ్డి, శివ శంకర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.