5 March, 2026 | 10:06 PM

బీసీల బడ్జెట్ రూ.25వేల కోట్లు కేటాయించాలి

05-03-2026 12:00 AM
  1. గత రెండేళ్లుగా కుంటుపడిన బీసీ సంక్షేమ అభివృద్ధి
  2. ముఖ్యమంత్రికి ఎంపీ ఆర్ కృష్ణయ్య బహిరంగ లేఖ

ముషీరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): వచ్చే ఆర్థిక సంవత్సరం బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి బీసీల బడ్జెట్ 25వేల కోట్లు కేటాయించాలని, 290 బీసీ గురుకుల పాఠశాలలకు, 325 కాలేజీ హాస్ట ళ్లు సొంత భవనాలు నిర్మించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్య సభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసినట్లు బుధ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రె స్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించి ఇంతవరకు రూ.10 వేల కోట్లకు మించి కేటాయించగపోగా, కేటాయించిన బడ్జెట్ ఖర్చు పెట్టడం లేదన్నారు.

గత రెండేళ్లుగా బీసీ సంక్షేమ అభివృద్ధి కుంటుపడిం దని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పథకాలు లేవు, పీజులు, స్కాలర్షిప్స్ చెల్లించడం లేదన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయ డం లేదన్నారు. ఒక హాస్టల్ బిల్డింగ్ కానీ, గురుకుల పాఠశాల బిల్లులు గానీ కట్టలేనన్నారు. చివరకు ఒక పైసా ఖర్చు లేని స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42 శాతంకు పెంచుతామని వాగ్దానం చేసి పెంచలేదన్నారు. బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పేరుకే బీసీ సంక్షేమ శాఖ కాని ఒక బీసీ ఉన్నత అధికారిని కమిషనర్, సెక్రటరీ బీసీని నియమించలేదన్నారు.

బీసీలను విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో అణచివేస్తున్నారని ద్వజమెత్తారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరిం చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బీసీ, ఈబీసీ విద్యా ర్థులకు పూర్తి పీజులు మంజూరు చేయాలన్నారు. విదేశీ విద్య స్టైఫండ్ స్కీమ్ క్రింద అర్హులందరికీ స్టై పండ్ ఇవ్వడానికి దీని బడ్జెట్ రూ.60 కోట్ల నుంచి రూ.300 కోట్ల కు పెందాలన్నారు. బీసీ అడ్వకేట్లకు ఇచ్చే స్టై పండ్ నెలకు రూ.1000 నుంచి రూ.10 వేలకు పెంచాలన్నారు.