10 May, 2026 | 11:36 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం

29-09-2025 07:41 PM

మాజీ సర్పంచ్లు ఎర్నేని వెంకటరత్నం బాబు, కుసుమ దంపతులు..

కోదాడ: బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని కోదాడ మాజీ సర్పంచులు ఎర్నేని వెంకటరత్నం బాబు కుసుమ దంపతులు అన్నారు. ఆదివారం రాత్రి కోదాడ పట్టణంలోని గోపిరెడ్డి నగర్ లో బతుకమ్మ సంబరాల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలనే దేవతలుగా భావించి పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదన్నారు. మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అని గోపిరెడ్డి నగర్  బంగారు బతుకమ్మ కమిటీ అంబరాన్ని అంటే సంబరాలతో బతుకమ్మ పండుగ నిర్వహించడం అభినందనీయం అన్నారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్తవరపు పాండురంగారావు ముత్తి నేని సైడేశ్వరరావు నూనె సులోచన , అంజన్ గౌడ్, ఉప్పగల్ల శ్రీను,వెంకటాచారి గంధం పాండు సాతులూరి గురవయ్య, బంగారు బతుకమ్మ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.