27 August, 2026 | 3:21 PM

కామారెడ్డిలో TGEJAC మహా ధర్నాకు తరలిన బాన్సువాడ డివిజన్ ఉద్యోగులు

27-08-2026 01:09 PM

బాన్సువాడ, ఆగస్టు 27 (విజయ క్రాంతి): ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో TGEJAC ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నా కార్యక్రమానికి బాన్సువాడ డివిజన్ ఉద్యోగులు గురువారం బయలుదేరారు. PRC అమలు, 6 డీఏల విడుదల, హెల్త్ కార్డుల సమస్య పరిష్కారం, CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్లతో ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా బాన్సువాడ డివిజన్ నుంచి TNGO డివిజన్ సెక్రటరీ మహమ్మద్ అజీమోద్దీన్, ఉపాధ్యక్షులు చిట్టెంపల్లి రవి, ఉద్యోగులు సంజీవ్, భీమన్న, గంగాధర్, జబ్బార్, కాశీరాం, ధర్మన్న, మాజీద్, బాలరాజు, శంకర్ తదితరులు మహా ధర్నాకు బయలుదేరారు.ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌కు చెందిన పలువురు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు