విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
కేసముద్రం (విజయక్రాంతి): కలాం మిషన్ విద్య విజ్ఞాన్ సేవా కార్యక్రమంలో భాగంగా, నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ (ఎన్‌ఎఫ్‌హెచ్‌సి) ఫౌండేషన్ ఆధ్వర్యంలోకేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గ్రంథాలయానికి ఎన్ ఎం ఎం హెచ్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వామ్యమవుతూ, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఎన్‌ఎఫ్‌హెచ్‌సి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీనియర్ శాస్త్రవేత్త మోహన్, వారి మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను అందించిన దాత సీనియర్ శాస్త్రవేత్త స్రవంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






