బ్యాంకర్లు సమన్వయంతో ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా కృషి చేయాలి
కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
కామారెడ్డి, మార్చి26 (విజయక్రాంతి): బ్యాంకాక్ సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్ లోని మినీ సమావేశం హాలులో బ్యాంకాక్లతో సమావేశం నిర్వహించారు. వార్షిక రుణ ప్రణాళిక 202526 లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకులు మరింత కృషి చేయాలన్నారు. ప్రాధాన్యత రంగాలకు రుణ ప్రవాణి పెంచాలని పెండింగ్ దరఖాస్తులు ఎంపీ ఖాతాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు.
బ్యాంకులు తమ డేటాను సకాలంలో సమర్పించాలన్నారు. వ్యవసాయ రంగంలో పంట రుణాలు మౌలిక సదుపాయాల రుణాలు మంజూరు పునరుద్ధరణను వేగవంతం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. గత సమావేశంలో ఆమోదించబడ్డ వాటిపై తీసుకున్న చర్యలు నివేదికను పరిశీలించి అనేక రంగాలలో పురోగతి జరిగినట్లు గుర్తించారు. గురువారం మినీ సమావేశం మందిరంలో జిల్లాలో బ్యాంకింగ్ సేవలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు డిసెంబర్ 2025 త్రైమాసికానికి సంబంధించిన ౄCC/ౄLRC సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. సభలో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అమలు పరిస్థితిని సమీక్షించారు. 30.12.2025న జరిగిన గత సమావేశం లో ఆమోదించబడ్డ వాటిపై తీసుకున్న చర్యల నివేదికను పరిశీలించి, అనేక రంగాలలో పురోగతి నమోదైనట్లు గుర్తించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధు మోహన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, బ్రాంచ్ మేనేజర్ లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




