బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి
హోంమంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలం
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధానమంత్రి మోదీని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. సామాన్య మ హిళకు న్యాయం చేయలేకపోయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోంమంత్రిగా విఫలమయ్యారని విమర్శించారు.
ప్రధాని మోదీ మాటలకే పరిమితమని, మహిళలపై నేరాలు పెరుగుతున్నా స్పందించరనే విషయం బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు విషయంలో రుజువైందని విమర్శించారు. బాలి కపై లైంగికదాడికి పాల్పడింది తన క్యాబినెట్ సహాయ మంత్రి కొడుకు అని తెలిసినా మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఒక బాలిక తనకు జరిగిన అన్యాయంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు 13 గంటలు పోలీస్‌స్టేషన్‌లో ఎదురుచూసిందం టే రాష్ట్రంలో పోలీసులు సామాన్యుల పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శిస్తున్నారో, పాలక పక్షాలకు ఎలా కొమ్ము కాస్తున్నారో అర్థం చేసుకోవచ్చని ఆరోపించారు.
కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులు కలిసి కేసును తొక్కిపెట్టే ప్రయత్నాలు చేయడం రెండు కోట్ల తెలంగాణ మహిళలను అవమానపరచడమేనని విమర్శించారు. బండి భగీరథ్ గతంలో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని వీడియో రుజువులు ఉన్నాయని, అవి చూసి కూడా బండి సంజయ్ కొడుకు అ మాయకుడని పోలీసులు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే బీఆర్‌ఎస్ కార్యకర్తలను కేసులు పెట్టి వేధించి రేవంత్‌రెడ్డి, పోలీసులు ఇంత పెద్ద ఘటనపై నిమ్మకునీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు నేరాలు చేస్తే ఎలాంటి చర్యలు ఉండవా అని ప్రశ్నించారు.
ప్రియాంక గాంధీ మహిళనే కదా? సాటి మహిళపై లైంగికదాడి జరిగితే స్పందించారా? రేవంత్‌రెడ్డిని ఆదేశించే స్థితిలో లేదా? రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్న రాహుల్‌గాంధీకి తెలంగా ణ మహిళలపై జరుగుతున్న నేరాలు పట్టవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి బండి కొడుకుని రక్షించాలని ఎన్ని రకాల ప్ర యత్నాలు చేసినా బాధిత మహిళకు న్యా యం జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. టీజీపీఎస్సీ మా జీ సభ్యురాలు సుమిత్రానంద్ మాట్లాడుతూ.. బండి సంజయ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని, బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టుచేసి చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. బీజేపీకి, మోదీకి చిత్తశుద్ధి ఉంటే సంజయ్‌ను బర్తరఫ్ చేయాలన్నారు.






