calender_icon.png 24 February, 2026 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్వోసీ వద్ద బెలూన్ల కలకలం

24-02-2026 12:05:48 AM

బుడగల్లో విదేశీ కరెన్సీ గుర్తింపు

శ్రీనగర్, ఫిబ్రవరి ౨౩: జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్ నియంత్రణ రేఖ (ఎల్వోసీ)ను దాటి సోమవారం పాక్ వైపు నుంచి వచ్చిన బెలూన్లు కలకలం రేపాయి. గునారా గ్రామస్తులు విమానం ఆకారంలో ఎల్వోసీ సమీపంలో తెలుపు, ఎరుపు రంగు బెలూన్లను గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బెలూన్లు పగులగొట్టి చూశారు. బెలూన్లలో ౫ వేల పాక్ కరెన్సీ నోటు, కొన్ని అమెరికన్ డాలర్లు లభించాయి. పాక్ నుంచి బెలూన్లు రావడం సాధారణమే అయినప్పటికీ, ఇలా విదేశీ కరెన్సీ నోట్లతో బెలూన్లు రావడం ఇదే మొదటి సారి అని పోలీసులు తెలిపారు. బెలూన్ల విషయంపై ప్రస్తుతం ఫోరెన్సిక్ విచారణ జరుగుతోంది.