14 July, 2026 | 3:25 PM

Breaking News

ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •  

బాల్క సుమన్ దౌర్జన్యం

19-02-2026 02:06 AM
  1. హరీశ్‌రావు..కనిపిస్తలేదా?
  2. మంత్రి, ఎంపీ వాహనాలపై.. దాడి చేసిన వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తవు
  3. మంత్రి గడ్డం వివేక్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఒక మంత్రి, ఎంపీ వాహనాలపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మాజీమంత్రి హరీశ్‌రావు ఎలా సపోర్ట్ చేస్తారని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ నిలదీశారు. క్యాతన్‌పల్లిలో బాల్క సుమన్ చేసిన గొడవ, దౌర్జన్యం హరీశ్‌రావుకు కనిపించడం లేదా..? అని మంత్రి వివేక్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హరీశ్‌రావు కూడా క్యాతన్‌పల్లికి వచ్చి ప్రచారం చేశారని, కానీ మేం ఎవరిని కూడా అడ్డుకోలేదన్నారు.

బాల్క సుమన్ తమ వాహనాలపై దాడులు చేయడం వల్లే పోలీసులు చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నరాని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో బీఆర్‌ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేసిందిలేదన్నారు. అదే బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారుడు కోందరాంను అర్ధరాత్రి అరెస్టు చేశారని మంత్రి వివేక్ గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారా అని ప్రశ్నించారు.

బాల్క సుమన్ డ్రామా క్రియేట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంగళవారం చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ఉండటంతో తాము ఉదయం 11 గంటలకే కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నామని అన్నారు. కానీ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మధ్యాహ్నం 12 గంటలకు రావడంతో కోరం లేనందున ఎన్నిక వాయిదా పడిందని మంత్రి వివరించారు.

బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చెన్నూరు, క్యాతన్‌పల్లిలో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని మంత్రి ఆరోపించారు. అప్పట్లో నామినేషన్లు వేసిన వారిని బాల్క సుమన్ వేధించి, బలవంతంగా విత్‌డ్రా చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజాస్వామ్య పద్ధతిలో చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు సిద్ధంగా ఉన్నా సుమన్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని వివేక్ ధ్వజమెత్తారు. ప