ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేగటి రవి గౌడ్
తుంగతుర్తి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, సంక్షేమ పథకాల అమలులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు రేగటి రవి గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదిన పురస్కరించుకుని, భారీ కేకును కట్ చేసి, ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం ప్రభుత్వ దవాఖానాలో రోగులకు బ్రెడ్ అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే తన మీద నమ్మకముతో మండల పార్టీ అధ్యక్షునిగా రావడం చాలా సంతోషకరమైన విషయం అని, గ్రామాల్లో నాయకులను కలుపుకుపోతూ, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నా ఎన్నికకు సహకరించిన జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి ఎంపీ చామలి కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామేలు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బికూజి ,దాసరి శ్రీను, నల్లు రామచంద్రారెడ్డి, రామ్ చందర్, పోలేపాక రామచంద్రు, శ్రీను, మహేందర్ గౌడ్, పెండెం రామ్మూర్తి ,అజయ్ కుమార్, దీప్లా నాయక్, రవీందర్ రెడ్డి, సృజన్, వెంకటేష్, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






