19 March, 2026 | 12:00 AM

బైరాన్‌పల్లిని పర్యాటక కేంద్రంగా చేయాలి

18-03-2026 05:53 PM

జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల: తెలంగాణ సాయుధ పోరాటంలో సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం బైరన్‌పల్లి గ్రామ ప్రజలు ప్రదర్శించిన ధైర్యసాహసాలను గౌరవిస్తూ వారి బలిదానాలను స్మరించేందుకు ఆ గ్రామానికి వీర బైరాన్‌పల్లిగా నామ కరణం చేయాలని జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభూత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి పర్యాటక, సంస్కృతి, పురావస్తు శాఖా మంత్రి జూపల్లి కృష్ణా రావుకు బుధవారం జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు.

బైరన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్ గ్రామాల చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశాలుగా అధికారికంగా ప్రకటించి ఈ ప్రాంతంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, బైరన్‌పల్లిలోని ప్రసిద్ధ బురుజు సహా ఇతర చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని సూచించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ఈ ప్రాంతంలోని అమరవీరుల కుటుంబాలకు, ప్రాణాలతో బయటపడిన వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు.