8 August, 2026 | 10:39 PM

విద్యార్థులు బాగా చదివి వృద్ధిలోకి రావాలి

08-08-2026 09:25 PM

చందిప్ప సర్పంచ్ మల్లికార్జున్

శంకర్ పల్లి,(విజయక్రాంతి): విద్యార్థులు బాగా చదివి వృద్ధిలోకి రావాలని చందిప్ప సర్పంచ్ మల్లికార్జున్ పేర్కొన్నారు. శనివారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బేజర్ ఇండియా సంస్థ కంపెనీ వారు అందించిన బ్యాగులను, స్టేషనరీ, నోట్ బుక్స్ ను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం మేయర్ సంస్థ వారు ఎన్నో సేవలను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి మంచి మార్కులు వచ్చే విధంగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బేయర్ సంస్థ ప్రతినిధి పినిశెట్టి నరేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయరాం, ఉపాధ్యాయులు శ్రీరాములు గౌడ్, ఉప సర్పంచ్ లింగంపల్లి లక్ష్మీనరసింలు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.