15 June, 2026 | 2:39 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

బడీడు పిల్లలను స్కూల్‌లో చేర్పించాలి

27-11-2025 12:00 AM

ఎంఈవో పావని 

 చిగురుమామిడి, నవంబర్ 26(విజయక్రాంతి): ఆరు నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను బడిలో తప్పనిసరిగా చేర్పించాలని మండల విద్యాధికారి (ఎంఈవో) పావని సూచించారు. మండలంలోని చిన్న ముల్కనూర్ గ్రామంలో బడి బయట పిల్లల సర్వేలో భాగంగా శ్రీ సాయి క్లే బ్రిక్స్, మణికంఠ ఫ్లైయుష్ బ్రిక్స్, శాతవాహన ఫీడ్ ప్లాంట్లను కాంప్లెక్స్ ను బుధవారం సందర్శించారు.ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుంచి ఇటుక బట్టీలలో పనిచేయుటకు వచ్చిన తల్లిదండ్రులతో, బట్టి యజమానులతో మాట్లాడారు.

5 సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని సూచించారు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలను ప్రాథమిక పాఠశాలలకు పంపించాలన్నారు. వారి పిల్లలకు రవాణా సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత యజమానులపై ఉందన్నారు. వీరి వెంట కాంప్లెక్స్ హెచ్‌ఎం మహమ్మద్ ఇర్షాద్, ఉపాధ్యాయులు తిరుపతయ్య, శ్రీనివాస్, రాజు రెడ్డి, ఐఈఆర్ పి తిరుపతి, సిఆర్పిలు బెజ్జంకి ఆంజనేయులు, శ్రీనివాస్,వెంకటేశంపాల్గొన్నారు.