28 June, 2026 | 1:59 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి

01-12-2025 02:02 AM

ఏరియా ఆసుపత్రిలో ఘటన..

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణ 

న్యాయం చేయాలంటున్న బాధితుడు

మణుగూరు, నవంబర్ 30 (విజయక్రాంతి ) : పురిటి నొప్పులతో ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన మహిళకు గర్భశోకమే మిగిలింది. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భస్థ శిశువు కన్నుమూసిన ఘటన ఆదివారం సాయంత్రం వెలుగు లోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పినపాక మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన తోలేం అరుణ నిండు గర్భిణీ స్త్రీ. పురిటి నొప్పులతో ఈ నెల 28న మణుగూరు ఏరియా ఆసుపత్రిలో చేరింది.

శనివారం రోజు తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు వెంటనే అరుణకు నార్మల్ డెలివరీ చేసేందుకు ప్రయత్నించారు. గర్భంలో శిశువు 3.6 కేజీలు ఉండడంతో డెలివరీ ఇబ్బందికరంగా మారింది. డెలివరీ పూర్తయ్యాక పండంటి బాబుకు జన్మని చ్చినా ఆ శిశువు చనిపోయాడు. ఈ విష యాన్ని గమనించిన వైద్యులు వెంటనే 108 లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు.

భద్రాచలంలో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే శిశువు మృతి చెందిందని తెలి పారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన బాబు చనిపోయాడని వైద్యుల పై చర్యలు తీసుకోవాలని శిశువు తల్లిదండ్రులు తోలం శంకర్, అరుణ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బాధిత గర్భిణి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. ఈ కాంగ్రెస్ పాలనలో చావులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.