25 April, 2026 | 7:09 PM

నీటి శుద్ధిపై అవగాహన సదస్సు

25-04-2026 05:45 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి గ్రామం విజయపురికాలనీలో శనివారం మిషన్ భగీరథ నీరు శుద్ధి చేసే విధానం పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.నీరు శుద్ధి చేసే విధానాన్ని గ్రామీణ నీటి సరఫరా అశ్వారావుపేట ల్యాబ్ సభ్యులు ప్రజలకు అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి సర్పంచ్ కోర్స చంద్రలేఖ, ఉప సర్పంచ్ పువ్వాల లలితారావు, పంచాయతీ కార్యదర్శి చేకూరి రవి,వార్డ్ సభ్యులు ముదిగొండ శ్రీను, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వరప్రసాద్, ల్యాబ్ సభ్యులు,గ్రామప్రజలు పాల్గొన్నారు.