8 May, 2026 | 8:12 AM

జనగణనపై అవగాహన సదస్సు

08-05-2026 12:00 AM

ఎల్లంపేట్ మునిసిపల్‌లో ఘనంగా 2కే రన్ ప్రారంభం

మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి

మేడ్చల్ అర్బన్ మే 7(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో  2కే మారథాన్ రన్ నిర్వహించారు.

ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ ఎన్ కృష్ణారెడ్డి,చైర్ పర్సన్  లావుడ్య శ్రీదేవి రమేష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ స్థానిక వివేకానంద విగ్రహం నుండి ప్రారంభమై ఎల్లంపేట్ బస్టాప్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు తమ వివరాలను తామే నమోదు చేసుకునే స్వీయ గణన విధానంపై అవగాహన కలిగి ఉండాలని తద్వారా పారదర్శకమైన గణాంకాలు సాధ్యమవుతాయని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లు అధికారులు.మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.డ్వాక్రా సంఘాల మహిళలు.యువజన సంఘాల సభ్యులు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.జనగణనతోనే ప్రజా సంక్షేమం అనే లక్ష్యంతో అవగాహన ర్యాలీ సాగింది.

మున్సిపల్ యంత్రాంగం చేపట్టిన ఈ వినూత్న అవగాహన కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి.బిజెపి కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్.బిఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ నిషిత రెడ్డి.చిన్నోళ్ల భాస్కర్.సద్ది సురేష్ రెడ్డి.విగ్నేశ్వర్ రెడ్డి ముత్యాలు గౌడ్.శ్రీలత రమేష్ యాదవ్.లతోపాటు మున్సిపల్ సిబ్బంది డ్వాక్రా సంఘాల మహిళలు.యువజన సంఘాల సభ్యులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.