4 March, 2026 | 11:48 AM

ఈ నెల 5న ప్రాజెక్ట్ వర్క్‌పై అవగాహన సదస్సు

04-03-2026 12:00 AM

ఐఐఎంసీ కళాశాలలో నిర్వహణ

ఖైరతాబాద్, మార్చి ౩(విజయక్రాంతి) : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైసెస్ సంయుక్తంగా ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు లక్డికాపుల్‌లోని ఐఐఎంసీ కళాశాల ప్రాంగణంలో ‘ప్రాజెక్ట్ వర్క్‌పై అవగాహన సదస్సు’ (డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు)ను నిర్వహిస్తున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘువీర్ పేర్కొన్నారు.

మంగళవారం సదస్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించిన వివరాలను జంట నగరాల్లోని అన్ని కళాశాలలకు మా కళాశాల స్టూడెంట్ కౌన్సిల్ సభ్యుల ద్వారా అందజేశామన్నారు. ఈ సదస్సు ఉద్దేశం డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, ఐపిఇకి చెందిన 15 మంది నిష్ణాతులైన అధ్యాపకులచే ప్రాజెక్టు వర్క్‌పై అవగాహన కల్పించడం.

దీనికి సంబంధించి మధ్యాహ్న ం 12.30గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.సదస్సులో పాల్గొనే వారికి ఐఐఎంసీ అండ్ ఐపిఇవారి ఉచిత కిట్ , ఉచిత పాకెట్ ప్రాజెక్టు వర్క్ గైడ్, ప్రశంసా పత్రం అందజేస్తారు.ఈ సదస్సులో పాల్గొనడానికి ఎంపిక విధానం ఎవరు మొదటగా వస్తే వాళ్లకు మొదట అడ్మిషన్ ఇచ్చే ప్రాతిపదికన ఉంటుంది.

కావున  విద్యార్థులందరూ త్వరితగతిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కొని ప్రాజెక్ట్ నిర్వహణపై అవగాహన పెంపొందించుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ కోరారు. వివరాల కోసం 9346978530, 9492863583, 9493976082, 97034 76767, 9908615205, 9052810304, 9052271736, 9440678678 నంబర్లను సంప్రదించగలరు.