16 March, 2026 | 4:14 PM

మత్తుకు దూరంగా ఉంటేనే ఆనందం- ఆరోగ్యం

16-03-2026 11:56 AM

మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ 

తాండూరు,(విజయక్రాంతి): మత్తు, డ్రగ్స్ దార్థాలు సేవించకుండా వాటికి దూరంగా ఉంటేనే జీవితంలో ఆనందం, ఆరోగ్యం కలిగి ఉంటారని వికారాబాద్ జిల్లా తాండూర్ పురపాలక సంఘం అధ్యక్షురాలు నీరజ అన్నారు. సోమవారం పట్టణంలో ప్రజా పాలన ప్రణతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా యువజన సంఘాలు, ప్రజా సంఘాలు ,స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో పురపాలక సిబ్బంది  ''సే నో డ్రగ్స్' అంబేద్కర్ చౌక్ నుండి శివాజీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా  ఆమె మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారి యువత భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని, సమాజ భద్రతను దెబ్బతీస్తుందని,అందుకే  డ్రగ్స్ రహిత తాండూర్ గా” లక్ష్యం ప్రతి పౌరుడి కర్తవ్యంగా భావించి ముందుకు సాగాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పుర ఉపాధ్యక్షులు అబ్దుల్ రజాక్, వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు.