15 April, 2026 | 12:26 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జల్ జీవన్ మిషన్‌పై అవగాహన కార్యక్రమం

15-04-2026 12:00 AM

శ్రీరంగాపురం ఏప్రిల్ 14: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జానంపేట గ్రామంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పథకం ద్వారా గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీటి ప్రాముఖ్యత, నీటి సంరక్షణ, సరైన వినియోగంపై వివరంగా అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని గ్రామ సర్పంచ్ రాముడు తెలిపారు.

అనంతరం జానంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ వర్కర్స్కు గౌరవార్థం సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కొత్త యూనిఫామ్లు, సబ్బులు, నూనె పంపిణీ చేశారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం సేవలు అందిస్తున్న వర్కర్స్కు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాముడు, ఉప సర్పంచ్ నాగరాజు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.