అల్ఫోర్స్‌లో శ్రావణ శోభ
15-08-2026 01:20 AM
కొత్తపల్లి, ఆగస్టు 14 (విజయక్రాంతి): కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రావణ శోభ కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మాసాలలో శ్రావణ మాసానికి ప్రత్యేకత ఉన్నదని, ఈ మాసంలో వివిధ రకాల పూజలను నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీవరలక్ష్మి శుక్రవారం, నాగు ల పంచమి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి, శివారాధన, విష్ణు ఆరాధన, గౌరీదేవి పూజ సైతం ఈ మాసంలోనే ఘనంగానే జరుపుకుంటారని పేర్కొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరలు పాల్గొన్నారు.






