డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి
మాదక ద్రవ్వాల వినియోగంపై కఠిన చర్యలు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మాదక ద్రవ్యాల నిర్మూలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశంసారం ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి, ఎక్సైజ్ సిఐ మమ్మద్ జలీల్ ఆధ్వర్యంలో మండలంలోని మాసానీపల్లి జలాల్పూర్ గ్రామాలలో పోలీస్ కళాబృందం చేత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి ఓటీపీలు చెప్పవద్దని, అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేయాలని, మహిళలకు రక్షణగా షి టీం ఉందని వేసవికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది.
అంతేకాకుండా పొగాకు, గుట్కా, పాన్, కైని,డ్రగ్స్, వినియోగం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతాయని, ప్రాణహాని తప్పదని ఎక్సైజ్ సీఐ జల్లిలోద్దీన్, సిఐ రాజారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని మాసానీపల్లి గ్రామంలో డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మహమ్మద్ జలీల్ యొద్దిన్, సిఐ రాజారెడ్డి మాట్లాడుతూ...డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత ఎటువంటి వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని, మంచి అలవాట్లను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటూ అణచివేస్తుందని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, యువత యోగ, వ్యాయామం వంటి మంచి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. చెడు అలవాట్ల వల్ల ప్రాణనష్టాలు పెరుగుతాయని, ఆందోళన వ్యక్తం చేస్తూ సమాజంలో డ్రగ్స్ పై అవగాహన పెంపు అవసరమని పేర్కొన్నారు. గుట్కా వంటి హానికర అలవాట్లపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం నోటి క్యాన్సర్ కారణంగా దేశంలో లక్షల మంది విలువైన ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలన్నారు.






