27 July, 2026 | 12:04 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

కళాజాత ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్య వంతులుగా చేయాలి

09-03-2026 05:11 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కళాజాత ప్రదర్శనల ద్వారా జిల్లాలో కుష్ఠు/బోద వ్యాదుల నివారణపై ప్రజలకు చైతన్య వంతులను చేయాలని కలెక్టర్ కె. హరిత అన్నారు. సోమవారం రోజున జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులతో జిల్లాలో కుష్ఠు/బోద వ్యాధులపై అవగాహన కొరకు కళాజాత ప్రదర్శన రథాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె.సీతారాం జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి బానోత్ దత్తారావుతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రచార వాహనమును ప్రారంభించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతు జిల్లాలో కుష్ఠు బోదకాల వ్యాధులు విస్తరిస్తున్నందున నివారించడం పై తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు తెలంగాణ సంస్కృతి సారధి కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి వాల్లని చైతన్య వంతులను చేయాలని కలెక్టర్ అన్నారు.