పోషణ పక్వాడపై అవగాహన
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లల తల్లులు , కిశోర బాలికలు పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలని సూపర్వైజర్ పెంటుబాయి, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ (డీఎంసీ) శారద, జెండర్ స్పెషలిస్ట్ (జీఎస్) రాణి సూచించారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాజంపేట క్లస్టర్–3 మ, ఆసిఫాబాద్ క్లస్టర్–3 అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్వాడ సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, ముఖ్యంగా మినరల్స్, విటమిన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు , చిన్న పిల్లల తల్లులు సరైన సమయంలో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు.అధికంగా టెన్షన్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని, ముఖ్యంగా టీవీ సీరియల్స్ చూస్తూ , ఆందోళనతో ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని హార్మోన్లపై ప్రభావం పడుతుందని వారు వివరించారు. అందువల్ల ప్రశాంతంగా, సమయానికి ఆహారం తీసుకోవాలని సూచించారు.అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార పదార్థాలను గర్భిణీలు, బాలింతలు మరియు పిల్లలు తప్పకుండా వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్ సాగర్, అంగన్వాడి టీచర్లు రజిని, శోభ, ఆయాలు కాంతాబాయి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.






