16 July, 2026 | 2:47 PM

Breaking News

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరం   •   స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా ఎదగాలి   •   నీటి విడుదల కోసం రైతుల ధర్నా   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుపై ఎమ్మెల్యే వైఖరి తెలపాలి   •   వర్షం కోసం రైతుల పూజలు   •   జగ్గారం లో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె   •   సీతారామ సాగర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేకాఫ్ పాయింట్ ను పరిశీలించిన మంత్రులు   •   హిందూ విద్యార్థిని కల్మాను చదవమనడం బాధకరం   •   హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: బండి సంజయ్   •   అమెరికా ఫెడ్ రిజర్వ్ లో ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక బాధ్యతలు   •  

ఉద్యోగుల సంక్షేమం కోసం అవగాహన కార్యక్రమం

23-01-2026 09:49 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి ఆధ్వర్యంలో బీడి వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, కామారెడ్డి కార్యాలయంలో కార్మికుల కోసం శుక్రవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  టి. నాగరాణి, డీఎల్ఎస్ఎ సెక్రటరీ, కామారెడ్డి  హాజరై, పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల హక్కులు, శ్రేయస్సు, భద్రతా మరియు ఆరోగ్య పరిరక్షణపై ముఖ్యమైన సూచనలు అందించారు.

ఉద్యోగుల సంక్షేమం కోసం అవగాహన కార్యక్రమాల ప్రాముఖ్యతను, సరైన నియమావళి పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. ఎంప్లొయ్యెస్  (సేఫ్టీ అండ్ వెల్ఫేర్) చట్టం, కార్మికులకు కనీస జీతం, సమయానికి జీత చెల్లింపు, పని సమయంలో గాయమైతే, నష్టపరిహారం,  ఉద్యోగుల యూనియన్ హక్కుల చట్టాల గురించి, అలాగే, ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల ప్రాముఖ్యత,మరియు పని చేసే పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను వివరించారు. 

కార్యక్రమంలో ఖమ్రుద్దీన్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, నవ తెలంగాణ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు  ఖాజా మోయినుద్దీన్, నవ తెలంగాణ యూనియన్  సెక్రటరీ మరియు బీడి కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రాజు, డీఎల్ఎస్ఎ జూనియర్ అసిస్టెంట్ ఖాజా సమీ ఉల్లాహ్ ఖాన్  & స్టాఫ్  మరియు ఇతరలు హాజరైనారు.