15 June, 2026 | 3:22 PM

Breaking News

కేటీఆర్ ను కలిసిన పట్టణ అధ్యక్షులు   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు   •   శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం   •   తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •  

‘సర్’పై అవగాహన శిబిరం

14-06-2026 12:00 AM
  1. పీసీసీ ఆధ్వర్యంలో బిచ్కుందలో నిర్వహణ
  2. పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్‌గుప్తా హాజరు

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు టీపీసీసీ నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) కోసం ఏర్పాటు చేసిన అవగాహన, శిక్షణ శిబిరం నిర్వహించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జి, జుక్కల్ నియోజకవర్గ బీఎల్‌ఏ ఇంఛార్జి ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ముఖ్య అతిథిగా హాజరై కీలక సూచనలు చేశారు.

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఉప్పల శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఓటరును గుర్తించి వారి పేర్లు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలు, వార్డులు, బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్, బీఎల్‌ఏ కోఆర్డినేటర్ నవీన్, బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కవిత, బిచ్కుంద చైర్‌పర్సన్ సీమశెట్టి కర్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.