రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి
- రోడ్డు ప్రమాదాలపై యువతకు అవగాహన
- ఎస్సై చలి కంటి నరేష్
గరిడేపల్లి,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను నివారించడంలో యువత అవగాహన పెంచుకొని రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ కోరారు. మంగళవారం మండలంలోని కీతవారిగూడెంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేటి యువత చెడు బాటలో నడవకుండా మంచి మార్గంలో నడిచి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. యువకులందరూ ఐక్యమత్యంతో కలిసి మెలిసి ఉండి గ్రామానికి ఈ దేశానికి ఉత్తమ పౌరులుగా నిలవాలని ఆయన కోరారు.
ఎదుటివారికి ఏదైనా ఆపద వస్తే వెంటనే స్పందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన యువతకు సూచించారు. ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై యువత అవగాహన పెంచుకోవడమే కాకుండా ఇతరులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు రహదారి నిబంధనలు పాటించాలని, ప్రమాదాలను నివారించేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆయన కోరారు.






