విద్యార్థుల భవిష్యత్తుకు అంబేద్కర్ ఆలోచనలు దిక్సూచి
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కంపెల్లి అరవింద్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి, అనంతరం మాట్లాడుతూ... అంబేద్కర్ ఆలోచనలు ప్రతి విద్యార్థికి మార్గదర్శకంగా నిలుస్తాయని సమానత్వం, న్యాయం, విద్య యొక్క ప్రాముఖ్యతపై ఆయన ఇచ్చిన సందేశాలు నేటి యువతకు అత్యంత అవసరమని పేర్కొన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు. ప్రస్తుతం భారతదేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వంతో తమ హక్కులని తెలుసుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని వారు కోరారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో రానున్న రోజుల్లో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.






