22 April, 2026 | 3:32 AM

సంక్షేమ పథకాలు వినియోగించుకోండి

22-04-2026 02:01 AM
  1. సంక్షేమ పథకాలు వినియోగించుకోండి
  2. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ముషీరాబాద్,ఏప్రిల్ 21(విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు మంగళవారం అంబర్‌పేటలోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో అర్హులైన పేదలకు  400 ల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ లను మాజీ రాజ్యసభ ఎంపీ హనుమంతరావు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, రోహిన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ డిడ్డి రాంబాబులతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్   అందజేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో మోత రోహిత్ తదితరులు పాల్గొన్నారు.