వైభవంగా అష్టలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
ఎల్బీనగర్, ఏప్రిల్ 21 : ఆర్ కే పురం డివిజన్ వాసవి కాలనీలోని అష్టలక్ష్మి దేవాల యంలో ఇష్ట సహిత బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగోరోజు మంగళవారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, బాలభోగ మంగళశాసనం, తీర్థప్రసాద గోష్ఠ హయగ్రీవ ఇష్టి నిశాచూర్ణోత్సవము (పసుపు కొట్టుట) ఉత్సవమూ ర్తులకు అభిషేకాలు నిర్వహించారు.
హనుమత్ వాహనసేవా, శ్రీశంకర భగవత్పాదుల జయంతి సందర్భంగా అర్చన అనంతరం నిత్యపూర్ణాహుతి, ఇష్టి యాగశాలలో పూర్ణాహుతి, మంగళాశాసనము, తీర్థప్రసాద వినియోగము శ్రీవిష్ణు సహస్రనామస్తోత్ర పారాయణ, యాగశాలలో నిత్యహోమాలు, గరుడవాహనసేవ శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణమహోత్సవము దీపోత్సవం, అశ్వవాహ నసేవ ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఆలయ చైర్మన్ నాగమల్ల శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ గుప్త, కోశాధికారి దాచేపల్లి శ్రీనివాస్, సభ్యులు చిలుక ఉపేందర్ రెడ్డి, కిషన్ గుప్తా పాల్గొన్నారు.






