25 August, 2026 | 2:54 AM

ఆటో కార్మికుల ధర్నా విజయవంతం

25-08-2026 12:00 AM

కరీంనగర్ క్రైం, ఆగస్టు 24 (విజయ క్రాంతి): ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో చేపట్టిన ఆటో కార్మికుల ధర్నా విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా ఆటో కార్మికులు బందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు సఫలమని రాత్రి పూట ఆటో సంఘాల బందును విచ్చిన్నం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు.

చర్చలు జరిపినట్లైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా ముందుకు వచ్చి మా ఆటో నాయకులతో కలిసి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.ఆటో డ్రైవర్ల డిమాండ్లను నిర్దిష్ట సమయం లోపల నెరవేరుస్తామని పత్రికా ముఖంగా చెప్పాలని, జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్, మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జి అంతగిరి సంపత్, ఉపాధ్యక్షులు కొత్తూరి సత్యనారాయణ, ఇరవేణి కుమార్, కొత్తూరు రఘు, దండు అంజయ్య, కుకట్ల సంపత్, కోశాధికారి చిట్టి మల్ల నాగభూషణం,  తదితరులు పాల్గొన్నారు.