3 August, 2026 | 9:27 PM

ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి

03-08-2026 08:06 PM

మేడ్చల్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ఐ ఎన్ టి యు సి మేడ్చల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావ్ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించారు. ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని, పెన్షన్ ఇవ్వాలని, ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అంతేగాక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆటో డ్రైవర్లకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాలని కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు.