బొమ్మ తుపాకితో బెదిరించిన నిందితులు అరెస్టు
మేడిపల్లి,(విజయక్రాంతి): దంపతులు అర్ధరాత్రి అక్రమంగా ఓ ఇంట్లోకి ప్రవేశించి బొమ్మ తుపాకీతో బెదిరించిన నిందితులను అరెస్టు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ కు చెందిన చిత్తరంజన్ బిశ్వాస్, అతని భార్య ఇంద్రాణి బిశ్వాస్ క్లౌడ్ కిచెన్ వ్యాపారం నిర్వహిస్తోంది. ఏడాది క్రితం వారికి అనిల్ కుమార్ (40) అతని భార్య సుమన్ (37) తో పరిచయం ఏర్పడింది. అనిల్ కుమార్ అప్పుడప్పుడు బిశ్వాస్ ఇంటికి వస్తూ ఉండేవాడు.
ఆదివారం రాత్రి అనిల్ కుమార్ బిశ్వాస్ కు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడు. అర్థరాత్రి 1 గంట సమయంలో బాధితుడి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బొమ్మ తుపాకి చూపిస్తూ చంపేస్తానని బెదిరించాడు, అనంతరం అతని భార్య సుమన్ సైతం వచ్చి బెదిరించిందిఅని, బాధితులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి బొమ్మ తుపాకి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి పోలీసులు తెలిపారు.






