స్పందించారు..ఉపాధ్యాయుడిని నియమించారు
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని(Bejjur Mandal) ఏటిగూడ గ్రామంలో ఉపాధ్యాయుడు లేక తలుపులు తెరుచుకోలేదు అనే కథనం విజయ క్రాంతి దినపత్రికలో(Vijayakranthi Newspaper) వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. డిడి రమాదేవి ఆదేశాల మేరకు ఏటి గుడా గిరిజన పాఠశాలలో కాగజ్నగర్ మండలంలోని గన్నారంకు చెందిన లావిడే హరికృష్ణ ను నియమించినట్లు సోమిని గిరిజన ఆశ్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పంద్రం బిక్షమయ్య తెలిపారు.
ఏటి కూడా పాఠశాలలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయుడు పదవి విరమణ పొందడంతో నెల రోజుల నుండి ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామని పాఠశాల ముందు నిరసన తెలిపారు. ఇట్టి విషయం దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు వెంటనే స్పందించి ఉపాధ్యాయుడిని నియమించినందుకు గ్రామ ప్రజలు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుండి గ్రామంలోని విద్యార్థులను పనులకు పంపకుండా బడీలు పిల్లలను బడికి పంపించాలని, ఉపాధ్యాయుడు సక్రమంగా విధులకు హాజరుకావాలని ప్రధానోపాధ్యాయుడు భిక్షమయ్య సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఇప్పకాయల శంకరయ్య, శ్రీకాంత్, పోచయ్య తదితరులు ఉన్నారు.




