calender_icon.png 9 February, 2026 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు సహకరించాలి

09-02-2026 07:49:56 PM

సర్పంచ్ జాదవ్ రాజేశేఖర్

లింగాపూర్,(విజయక్రాంతి): మండలంలోని లింగాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్ జాదవ్ రాజేశేఖర్ మాట్లాడారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఫారెస్ట్ సంబంధిత సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన తెలిపారు. గ్రామంలో బోరు వేయాలని కోరుతున్నప్పటికీ సంబంధిత అధికారులు అనుమతులు ఇవ్వడంలో ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

వేసవికాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గ్రామానికి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  గ్రామసభకు వ్యవసాయ అధికారి హాజరు కాకపోవడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు ఏఈ అఖిల్, ఎఫ్‌బీఓ భగవంత్ రావు, ఆర్‌ఐ ప్రదీప్‌, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.