27 April, 2026 | 11:51 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించండి

09-02-2026 07:52 PM

నిర్మల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కమోదిని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, పోలింగ్ రోజు చేపట్టాల్సిన ఏర్పాట్లు, ఎన్నికల నియమావళి అమలు, శాంతి భద్రతల పరిరక్షణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు.

ఎన్నికల పోలింగ్ మొదలుకొని కౌంటింగ్ వరకు పోలీసు శాఖ తరపున పూర్తి ఏర్పాట్లు, చేశామన్నారు. పోలీసు బందోబస్తు,పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత తదితర అంశాలపై జిల్లా ఎస్పీ డా.జి జానకి షర్మిల ఐపీఎస్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదినికి కూలంకుషంగా వివరించారు. మున్సిపల్ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ డా. జి జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు.