03-02-2026 12:31:21 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలో దారణం చోటుచేసుకుంది. చింతలమానేపల్లి మండలానికి చెందిన ఓ బాలుడు (15) ఇంటికి సమీపంలోని 6, 9 ఏళ్ల బాలికలపై ఆదివారం రూ. 10 ఆశచూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ వ్యక్తి గమనించి కుటుంబ సభ్యులకు చెప్పగా ఆదివారం సాయంత్రం పంచాయితీ పెట్టారు. డబ్బులు ఇస్తానని ఆశ చూపాడు ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి వారిని తీసుకువెళ్లి అఘాయిత్యానికి ఓడి గట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.కులపెద్దలు బాలుడిని,అతడి తల్లిని మందలించి గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.కాగా ఈ ఘటనపై తమకు ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.