22 March, 2026 | 1:41 PM

సీజేఐపై దాడి అమానుషం

08-10-2025 12:25 AM

తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): సుప్రీంకోర్టులో సోమవారం సీజేఐ గవాయ్‌పై ఓ అడ్వకేట్ బూటు విసరడం అమానుష ఘటన అని తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. కోర్టులో విచారణ జరుగుతు న్న సమయంలో భారత ప్రధాన న్యా యమూర్తిపై దాడి న్యాయవ్యవస్థ గౌరవానికి విరుద్ధమైందన్నారు.

ఈ సందర్భంగా మంగళవారం ఎస్.వి సుబ్బయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్.ఉదయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి, నరేష్ యాదవ్, అసోసియేట్ అధ్యక్షుడు; కె. అనిత, ఉపాధ్యక్షురాలు; రాకేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ; మనీష్, ట్రెజరర్; సంధ్య, సుధా, స్వప్న, జయలక్ష్మి, స్నిగ్ధ, హుమారా సుల్తా నా, సూర్యప్రకాశ్ తదితర నిర్వాహక సభ్యు లు సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. న్యాయవ్యవస్థ గౌరవం, భద్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు.