22 March, 2026 | 4:49 PM

కొత్త రిజర్వాయర్లకు అనుమతులు..

08-10-2025 12:24 AM

వనపర్తి టౌన్ అక్టోబర్ 07:వనపర్తి జిల్లాలో నూతనంగా నిర్మించబోయే గొల్లపల్లి రిజర్వాయర్,బుద్ధారం స్టేజ్ 2 రిజర్వాయర్ నిర్మాణాలను చేపడితే నియోజకవర్గ పరిధిలో భవిష్యత్ తరాలకు సైతం సాగునీటి ఎద్దడి ఉండదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.

మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తో ప్రత్యేక సమావేశంలో కొత్త రిజర్వాయర్ల ఏర్పాటుపై అదేవిధంగా ఘనపురం మండలంలోని ఘనపసముద్రం రిజర్వాయర్ ఏర్పాటు లో భూములు కోల్పోయిన అన్నదాతలకు వెంటనే నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ని కోరడంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే రైతులకు నష్టపరిహారం మంజూరు చేయనున్నట్లు తెలిపారని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు.వనపర్తి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.