27 May, 2026 | 1:14 AM

కొనుగోళ్లపై ప్రభుత్వానికి ప్రణాళిక లేదు

27-05-2026 12:00 AM
  1. రైతు పండించిన ప్రతి గింజను కొనాలి
  2. రైతుల ఇబ్బందులు తొలగించేంతవరకు పోరాడుతాం 
  3. బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ 
  4. హనుమకొండ, జనగామ, యాదాద్రి జిల్లాల్లో ‘రైతు గోస-బీజేపీ భరోసా’ యాత్ర

హనుమకొండ/జనగామ/ఆలేరు, మే 26 (విజయక్రాంతి): వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని, రాష్ర్టంలో ప్రతి రైతు పండించిన పంట ఉత్పత్తుల చివరి గిం జను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము అండగా నిలుస్తామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ అన్నారు.

రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగం గా ఆ పార్టీ ప్రతినిధి వర్గ బృందం మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ క్రాస్ రోడ్ వద్ద పెంచికలపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసా య మార్కెట్‌ను, యాదాద్రి జిల్లాలోని ఆలేరు మార్కెట్ యార్డును బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బృందం సందర్శించింది.

రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించిందని, రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. రైతు పక్షమని ప్రకటించడం తప్పా ఆచరణలో ఎక్కడ కూడా పొంతన లేదన్నారు. యాసంగి సీజన్ ప్రారంభం నుండే పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు అగచాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మొక్కజొన్న, ధాన్యం పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించి, అందుకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలు, ఏర్పాట్లు, నిలువ చేయడానికి గోదాములు, ట్రాన్స్పోర్ట్, హమాలి ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ రైతు గోస, బీజేపీ భరోసా కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు చేపట్టిందని విమర్శించారు.

బిజెపి నేతలు కొనుగోలు కేంద్రానికి చేరుకోవడానికి ముందే హడావుడిగా ధాన్యాన్ని లారీల్లోకి నింపి అంతా సక్రమంగా జరుగుతుందని భ్రమ కల్పించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేకచోట్ల రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తికాక ఎండకు తడుస్తూ, వానకు ఎండుతున్నాయని, అన్నదాతకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని విమర్శించారు.

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల కొర్రీలు, అధికారుల నిర్లక్ష్యం చేయకూడదని, కేంద్రాలకు ధాన్యం తీసుకొచి వారాలు గడుస్తున్నా తూకం వేయ కపోవడంపై రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందన్నారు. జనగామ మార్కెట్లో రైతులు పడుతున్న ఇబ్బం దులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, ధాన్యం కొనుగోలు పూర్తి చేసి, రవా ణా చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

కార్యక్రమంలో ఎంపీ రఘునందన్‌రావు, శాసనస భ పక్ష ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సింగ్, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, రాకేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎంపీ కోడం నగేష్, గౌతమ్ రావు, అశోక్, కాసం వెంకటేశ్వర్,  రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎంపీ అజ్మీర సీతా రాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, కే. రాజయ్య యాదవ్, చందుపట్ల కీర్తి రెడ్డి, డాక్టర్ కాళీ ప్రసాద్, సిద్ధం నరేష్ పటేల్, ఎడ్ల అశోక్ రెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డి, పో తుగంటి భరత్ ప్రసాద్, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఆరుట్ల దశమంత రెడ్డి, మల్లాడి తిరుపతి రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షులు బలరాం, జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరు అశోక్‌గౌడ్,  బసవరాజు లక్ష్మయ్య, కాదూరి అచ్చయ్య, చంద్రశేఖర్ రెడ్డి, చిరిగె శ్రీనివాస్, కామిటి కృష్ణ, పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేష్, బొట్ల సంపత్, పాశికంటి సంపత్, బైరి మహేందర్ గౌడ్, తునికి దశరథ, జంపాల శ్రీనివాస్, సముద్రాల కల్పన పాల్గొన్నారు.