చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ ముట్టడి
జేఏసీ చైర్మన్ వకులళాభరణం నరసయ్య పంతులు
చేర్యాల,మార్చి 26: చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి జయప్రదం అయిందని చేర్యాల రెవిన్యూ డివిజన్ అఖిలపక్ష పోరాట సమితి జేఏసీ చైర్మన్ వకుళాభరణం నరసయ్య పంతులు అన్నారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అసెంబ్లీ వద్ద పోలీసులు జేఏసీ నాయకులను అడ్డుకొని అరెస్ట్ చేసి హైదరాబాదులోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారనీ అన్నారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నర్సయ్య పంతులు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు ఎన్నికల బహిరంగ సభలో అధికారంలోకి రాగానే చేర్యాలనే రెవిన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని చేర్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి హామీలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల ప్రాంతంలోని నాలుగు మండలాలు, ఒక మున్సిపల్ పట్టణ రెవిన్యూ డివిజన్ సిద్దిపేటలో రెండు, మద్దూరులో రెండు మండలాలు హుస్నాబాద్ లో, జనగామ అసెంబ్లీ, భువనగిరి పార్లమెంటులో, వ్యవసాయ శాఖ గజ్వేల్ కు, చేర్యాల 4 మండలాలను ఇష్టం వచ్చినట్లుగా ఎటుపడితే అటు కలిపి చేర్యాల ఆస్తిత్వం కోల్పోయే విధంగా చేశారని ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన చేర్యాల ప్రజలు అగమ్య గోచర పరిస్థితిలలో కొట్టుమిట్టడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేర్యాలను వెంటనే రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో బిఆర్‌ఎస్, బిజెపి, సిపిఎం, టిఎంఆర్పిఎస్, ప్రజా సంఘాల నాలుగు మండలాల నాయకులు,సర్పంచులు, మాజీ ఎంపీపీలు, జెడ్పిటిసిలు, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు, సహకార సంఘాల చైర్మన్లు, జేఏసీ ముఖ్యమైన నాయకత్వం అంతా కూడా అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు.




