24 August, 2026 | 5:41 PM

వర్షాలకు కూలిన ఇల్లు

24-08-2026 02:33 PM

చేగుంట ఆగస్ట్ 24, (విజయక్రాంతి): చేగుంట మండల పరిధిలోని చందాయపెట్ గ్రామంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాకలి రాములు, పై కప్పు గోడ కూలి. ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంత ఊపిరిపించుకున్నారు. అయితే ఇల్లుకు కూలిపోవడంతో నివాసం లేక రోడ్డున పడ్డామని బాధితులు ఆవేద వ్యక్తం చేశారు. నిరుపేదములైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.