14 July, 2026 | 11:20 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

ఏషియన్ థలసేమియా కాన్‌క్లేవ్

11-01-2026 01:01 AM

రూ.లక్ష విరాళం అందించిన డాక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): అంతర్జాతీయ చాంబర్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షుడు, లండన్‌లోని బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రదానం చేసిన భారత్ గౌరవ్ అవార్డు గ్రహీత డా అజయ్ కుమార్ అగర్వాల్.. హైదరాబాద్లో జనవరి 10, 11 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఏషియన్ థలసేమియా కాన్‌క్లేవ్ హాజరయ్యారు. థలసేమియా, ఇతర రక్త సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సహాయార్థం రూ.లక్ష విలువైన చెక్కును తెలంగాణ థలసేమియా, సికిల్ సొసైటీ అధ్యక్షుడు డా. చంద్రకాంత్ అగర్వాల్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ డా. అజయ్ కుమార్ అగర్వాల్, డా. చంద్రకాంత్ అగర్వాల్ నాయకత్వంలో థలసేమియా, సికిల్ సొసైటీ, తెలంగాణ నిర్వహిస్తున్న సేవలను ప్రశంసించారు.  ఇలాంటి మాన వతా కార్యక్రమాలకు చేయూతనివ్వడం సామాజిక బాధ్యతతో పాటు మానవీయ విలువలకు నిదర్శనమని డా. అజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. డా. చంద్రకాంత్ అగర్వాల్ మాట్లాడుతూ.. డా. అజయ్ కుమార్ అగర్వాల్ అందించిన సహాయం థలసీమియా రోగులకు వైద్య సేవలు, అవగాహన కార్యక్రమాలను కొనసాగించడంలో ఎంతో దోహదపడుతుందని తెలిపారు.