15 May, 2026 | 8:14 PM

Breaking News

పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •   మోడీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. రెండు నాలుకల సర్కార్   •   మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోమయ్య   •  

ఆరోగ్యానికి అశ్వగంధ

18-05-2025 12:00 AM

ఆయుర్వేదంలో అనేక మూలికలు ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. వాటికి అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. పురాతన కాలం నుంచి ఆయుర్వేద మందులతో వేలాది వ్యాధులు నయమయ్యాయి. అలాంటి దివ్యమైన ఔషధ మూలికల్లో అశ్వగంధ కూడా ఒక శక్తివంతమైన ఔషధం. 

గుండెపోటు, స్ట్రోక్, డయాబెటిస్, కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్, నరాల బలహీనత, ఆర్థరైటిస్ వంటి లెక్కలేనన్ని వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధను తరచూ వాడుతూ ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. కార్టిస్టాల్‌ను రెగ్యులేట్ చేయడం, స్ట్రెస్ హార్మోన్‌ను రిలీజ్ చేయడంలో అశ్వగంధ ఎంతో దోహదం చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.

అశ్వగంధ వల్ల ఇన్‌ఫ్లమేషన్ నుంచి పోరాడే శక్తి లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అశ్వగంధ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. ఫిజికల్ యాక్టివిటీ మెరుగవుతుంది. అశ్వగంధను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల మంచి నిద్ర కలుగుతుంది. హార్మోన్ల రెగ్యులేట్ చేయడం, ఫెర్టిలిటీ వంటి సమస్యలు అశ్వగంధ వాడటం వల్ల తగ్గుతాయి. 

అశ్వగంధ శరీరానికే కాదు.. మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందుతారు. కండరాల బలహీనత, నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. కంటి చూపును మెరుగు చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నియంత్రిస్తుంది.