15 June, 2026 | 3:17 PM

Breaking News

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం   •   తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •  

మేడ్చల్‌లో ఆశా వర్కర్ల రాస్తారోకో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

01-04-2026 12:39 AM

మేడ్చల్ అర్బన్, మార్చి 31 (విజయక్రాంతి): అక్రమ అరెస్టులకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు మేడ్చల్లో రాస్తారోకో చేశారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. డిమాండ్ల సాధన కోసం ఆశ వర్కర్ల చలో హైదరాబాద్ సందర్భంగా ఆశ వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాము ఖండిస్తున్నామని వారు తెలిపారు. అధికారంలోకి రాగానే తమకు 18 వేల రూపాయల  వేతనం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని తెలిపారు.

పోరాటాలను  అణచివేసిన గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని వారు అన్నారు. తమ సమస్యల పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మేడ్చల్ మండల కార్యదర్శి నరేష్, పద్మ, వసంత, కృష్ణవేణి, కల్పన, మాధవి, లక్ష్మి, యాదమ్మ, రేణుక, శ్రీదేవి, సునీత, మంజుల తదితరులు పాల్గొన్నారు.