17 March, 2026 | 1:12 AM

కారేపల్లిలో ఆశావర్కర్ల నిరసన

17-03-2026 12:08 AM

అసెంబ్లీ లో ఆశా ల సమస్యలపై చర్చించాలి : సీఐటీయూ

కారేపల్లి మార్చి 16 (విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలందించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్న ఆశాల పట్ల పాలకుల నిర్లక్య వైఖరిని నిరసిస్తూ సోమవారం కారేపల్లి పీహెచ్ సీ ఎదుట నిరసన తెలిపారు.  ఆశాలకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఆశాల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈసందర్బంగా సీఐటీయు కారేపల్లి మండల కన్వీనర్ కే.నరేంద్ర, హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు ఎల్లబోయిన రాధ లు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

రిటైర్మెంట్ బెనిఫిట్స్ చట్టం చేయాలని, ఇన్సూరెన్స్,  పిఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు.  ఆశా వర్కర్ల సమస్యలను అధికారం చేపట్టిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి హామీని అమలుకు ఎలాంటి చర్యలు చేపట్టటం లేదన్నారు.   

ఆశాల సమస్యలపై ఈనెల మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా, 26వ తేదిన చలో హెదరాబాద్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆశాల సమస్యలపై   కారేపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ బీ.సురేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు వాంకుడోత్ కమల, ఎన్.పద్మ, కళ్యాణి, సరస్వతి, చంద్రమ్మ, నాగలక్ష్మి, దేవ కరుణ, వీ. నాగమ్మ,  పద్మ తదితరులు పాల్గొన్నారు.