28 March, 2026 | 4:27 PM

Breaking News

టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •   'తొలి ముద్ద'.. బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం.. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం   •   కిషన్ రావుపేటలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన   •   కూసుమంచి తహాశీల్దారుగా సైదులు బాధ్యతలు స్వీకరణ   •   ఘనంగా రావి వీరవేన్లయ్య 34 వర్ధంతి   •   మున్సిపల్ కమిషనర్ టీపీఓల సరెండర్   •  

బిక్షాటనతో ఆశా కార్యకర్తల నిరసన

26-03-2026 01:49 AM

మహబూబాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు గత కొద్దిరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తుండగా, బుధవారం మరిపెడ మండల ఆశ వర్కర్లు బిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని ఆరోపించారు. 

ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం క్షేత్రస్థాయిలో నిత్యం వెట్టిచాకిరి చేస్తున్న తమకు కనీస వేతనం 18 వేలు అమలు చేయాలన్నారు. సీనియర్ ఆశాలను ఏఎన్‌ఎంలుగా నియమించాలని,  ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మరిపెడ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, తాసిల్దార్ కృష్ణవేణి, మండల వైద్యాధికారి డాక్టర్ గుగులోత్ రవికి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఉపేంద్ర, సునీత, శైలజ, స్వరూప, హాసియ, రమా, గణిత, జమున, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.