28 March, 2026 | 5:00 PM

Breaking News

మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •  

మున్సిపల్ కమిషనర్ టీపీఓల సరెండర్

28-03-2026 03:41 PM

మున్సిపల్ సమావేశంలో తీర్మానం చేసిన పాలకవర్గం

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, టీపిఓ గిరిధర్లను సరెండర్ చేస్తూ మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో శనివారం తీర్మానం చేశారు. మున్సిపల్ లో అవినీతి ఆరోపణలు రావడంతో పాటు ఏసీబీ అధికారుల విచారణ లో పలు అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ మున్సిపల్ చైర్ పర్సన్ తిప్ప ఉమారాణి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి లతోపాటు కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదాన్ని తెలిపారు. వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు ప్రతిపాదనలు తయారుచేసి కాలనీలలో ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆర్ డి ఓ వై వి గిరి సమావేశంలో పాల్గొన్నారు. కౌన్సిలర్ పలువురు పలు సమస్యలపై సభ దృష్టికి తీసుకువచ్చారు.