కోటగుళ్లలో భక్తుల కోలాహలం
ఘనంగా ఆరుద్ర నక్షత్ర చతుర్దశి పూజలు
అభిషేక కార్యక్రమంలో ఎస్‌ఐ బొరగల అశోక్
స్వామివారికి పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ
గణపురం, జులై 13 విజయక్రాంతి: మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో సోమవారం ఆరుద్ర నక్షత్రం చతుర్దశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఉదయం గణపతి పూజ నందీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణపేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించారు.
సోమవారం పర్వదినం సందర్భంగా గణపురం ఎస్‌ఐ బొరగల అశోక్ అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిషేకం అనంతరం స్వామి వారిని కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలతో వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆరుద్ర నక్షత్రం చతుర్దశి పర్వదినం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.






